పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

అనుభవాలు....

 నొప్పి తెలియని వాడు బాధ గురించి ఎలా రాస్తాడు  బాధ తెలియని వాడు బ్రతుకు గురించి ఏమి రాస్తాడు బ్రతుకే తెలియని వాడు మనిషి గురించి ఎలా రాస్తాడు ఒక్కో జీవితం ఒక్కో కథ ప్రతి కథకీ ఒక్కో గమనం, గమ్యం.. గమనం- నడిచిన దారి... గమ్యం - చేరిన దరి... ఎప్పుడూ సముద్రపుటలలే,,, గోదారి పరవళ్లే కాదు  అప్పుడప్పుడూ మనిషి కళ్ళల్లో.... మనసు లోతుల్లో చూస్తే గగన గంభీరమైన సాగరం ...  ఒరవడిలో ఉరవడి పోయిన నదీ తీరం కనిపిస్తాయి... అది అలసిన బ్రతుకు సంకేతం ఎంత మాత్రం కాదు. కదిలే కాలం నేర్పిన కొత్త పాఠం... నలిగిన మనసు నేర్చిన సరికొత్త నాటకం.. ఊహలకు రెక్కలు వస్తే ఎవరైనా ఎగురుతారు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచిన దారి చాలా దూరం . మనిషి పుడితే వేడుక... పోతే నిశ్శబ్ద వాటిక.. నడిమి సాగినదే మన గమనం. నిలిచి గెలిచినా ఓడినా అదో అనుభవం.. అనుభవాల అరలను వెదికితే జ్ఞాపకాల దొంతరలు ఎన్నో పలకరిస్తాయి... మనకు నచ్చినవి, నచ్చనివీ ..  కాలం ఈదిన వాడే మనిషి.. కాలం గెలిచిన వాడే మనీషి.. వాడు ఋషులలో .... మహర్షి. ఇదే చివరి గమ్యం.. పరా శ్రీ

నిశ్శబ్ద భావ తరంగాలు

 నిశ్శబ్ద భావ తరంగాలు నాలో నిత్యం కదిలే  కల్లోల కడలి అలజడులు.... నిశీధి ధూమ తరంగాలు  నాలో నిత్యం రగిలే  జ్వాలా శైల అగ్నిశిఖలు..... నిర్ణిద్ర ఆశా అంతరంగాలు  నాలో నిత్యం పెరిగే  మహా శిఖర హిమపాతాలు..... నేను నిరతం జ్వలించే అగ్ని శిఖరాన్ని నేను నిరతం జృoభించే హిమపాతాన్ని... నేను నిరతం శ్వాశించే ప్రాణ వలయాన్ని... నేను ఒకచో గాలిలో కలిసే వాయులీనాన్ని... నేను ఒకచో మట్టిలో కలిసే మంచి ముత్యాన్ని.... నేను ఒకచో మంటలో కలిసే ముగ్ధ శిశిరాన్ని... నేను ప్రకృతి ఒడిలో మురిసే మృదు శైశవాన్ని.... నేను ప్రకృతి ప్రతిబింబాన్ని.....నేను ఒక సుకృతిని.. పరా శ్రీ.....