అనుభవాలు....

 నొప్పి తెలియని వాడు బాధ గురించి ఎలా రాస్తాడు 

బాధ తెలియని వాడు బ్రతుకు గురించి ఏమి రాస్తాడు

బ్రతుకే తెలియని వాడు మనిషి గురించి ఎలా రాస్తాడు

ఒక్కో జీవితం ఒక్కో కథ

ప్రతి కథకీ ఒక్కో గమనం, గమ్యం..

గమనం- నడిచిన దారి... గమ్యం - చేరిన దరి...

ఎప్పుడూ సముద్రపుటలలే,,, గోదారి పరవళ్లే కాదు 

అప్పుడప్పుడూ మనిషి కళ్ళల్లో.... మనసు లోతుల్లో చూస్తే

గగన గంభీరమైన సాగరం ...  ఒరవడిలో ఉరవడి పోయిన నదీ తీరం కనిపిస్తాయి...

అది అలసిన బ్రతుకు సంకేతం ఎంత మాత్రం కాదు.

కదిలే కాలం నేర్పిన కొత్త పాఠం...

నలిగిన మనసు నేర్చిన సరికొత్త నాటకం..

ఊహలకు రెక్కలు వస్తే ఎవరైనా ఎగురుతారు.

కాళ్లకు చెప్పులు లేకుండా నడిచిన దారి చాలా దూరం .

మనిషి పుడితే వేడుక... పోతే నిశ్శబ్ద వాటిక..

నడిమి సాగినదే మన గమనం.

నిలిచి గెలిచినా ఓడినా అదో అనుభవం..

అనుభవాల అరలను వెదికితే జ్ఞాపకాల దొంతరలు ఎన్నో పలకరిస్తాయి...

మనకు నచ్చినవి, నచ్చనివీ .. 

కాలం ఈదిన వాడే మనిషి..

కాలం గెలిచిన వాడే మనీషి..

వాడు ఋషులలో .... మహర్షి.

ఇదే చివరి గమ్యం..


పరా శ్రీ


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...