వేణుగానలోల వేణుగోపాల
వేణుగానలోల వేణుగోపాల
ముక్తిగానలీల చేయ రావేలా
అధర మధురము నీ మూర్తి గానము
వదన మధురము నీ కీర్తి గానము
సకల మధురము నీ భావ గానము
సర్వ మధురము నీ లీల గానము
వేణు గాన లోల వేణు గోపాల
ముక్తి గాన లీల చేయ రావేలా
హృదయ మధురము నీ రాస లీల
మదన భరితము నీ ప్రేమ లీల
తత్వ చరితము నీ జార లీల
ముక్తి మార్గము నీ చోర లీల
వేణు గాన లోల వేణు గోపాల
ముక్తి గాన లీల చేయ రావేలా.. పరాశ్రీ
05.01.2022
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి