క్షణక్షణమూ కాలం..,

  క్షణక్షణమూ కాలం ..,

  కాంతి పరిమళాలను వెదజల్లుతూనే ఉంది 

  వియదాకాశంలో వెలుగుల సూరీడై..

  అంతర్నిహిత గానం వినిపిస్తూనే ఉంది

  విశ్వాంతరాళ నిశీధపథంలో


  క్షణక్షణమూ కాలం ..,

 నాగలిలా దున్నుతూనే ఉంది 

 రాయీరప్పలంటి దేహమొహాలను

 వర్షంలా పలికిస్తూనే ఉంది 

 అంతస్థమైన అవ్యక్త రాగాలను..


  క్షణక్షణమూ కాలం .,

  కొత్త కొత్త దేహాలను ధరిస్తూనే ఉంది 

  హేమంతశిశిర ఋతుభావాలతో

  అనంతమోహన వర్ణాలతో...

  

  క్షణక్షణమూ కాలం..,

  అస్థిత్వ భాషణం చేస్తూనే ఉంది 

  అగుపించని అర్ధాల రంగులతో

  దేహం విడిచిన ప్రశ్నలతో

  కొత్త జవాబులతో ...


  పరాశ్రీ...31122024


  నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...