పోస్ట్‌లు

శ్రమైక జీవన సౌందర్యానికి

       శ్రమైక జీవన సౌందర్యానికి      శాంతి అహింసల సామ్రాజ్యానికి      వారసులం వారసులం      స్వాతంత్య్రం సౌభ్రాతృమ్      సమతామమతలు   మా స్వాస్థ్యం   అనంత జీవన మాధుర్యానికి వినమ్ర జీవన సోపానానికి వారసులం వారసులం దానం ధర్మం త్యాగం స్నేహం మా స్వాస్థ్యమ్   విశాల దృక్పథ వినీల గగనాన వెలిగే మువ్వన్నెల జెండా మనదే మనదే విరోధి మనమున విశుద్ధ శాంతిని నింపే అశేష భావనల విశేష సంస్కృతి మనదే మనదే   అమృత తరంగిణులు మా నదులు అపార జ్ఞాన వాహినులు మా నుడులు కాలం కాయం కష్టం కర్మం మా నిధులు కదిలే కడలి కదలని నింగి మా బడులు   ఘర్మజలాలే మాకమృత సమానం స్వేచ్ఛాచింతనలే మా సంకల్పం              విశ్వశాంతి భావనలే మా సందేశం   జగదేక కుటుంబం మా హృదయం..    77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో పరాశ్రీ ... 12082023.

ఇది మామూలు జెండా కాదు!

  ఇది మామూలు జెండా కాదు! ఏదో ఒక కర్ర ముక్కకు కట్టిన నాలుగు పలకల గుడ్డముక్క అసలే కాదు! నాలుగు రంగుల్లో మిలమిల మెరిసే రంగుల స్వప్నం కానే కాదు.! అది కాషాయం అనుకుంటున్నారా ? కాదు. వందేమాతరం అన్నందుకు పగిలిన చర్మం చిందించిన నెత్తుటి జీర.! అది పసిమి పచ్చదనం అనుకున్నారా ? కాదు. భారత మాతా కీ జై అన్నందుకు తగిలిన కొరడా దెబ్బల అహంకార ముద్ర.! అది తెల్లని తెలుపు అనుకుంటున్నార ? కాదు. స్వాతంత్య్ర సాధనకు సర్వం ధారపోసిన మహనీయుల త్యాగానికి చిహ్నం.! అది ఏదో మామూలు నీలి రంగు చక్రం కానే కాదు! ఎంతో మంది ధన్య జీవులు , మానధనులు సాగించిన పోరాటానికి ఊపిరులూదిన స్వేచ్ఛా వాయువుల చక్ర భ్రమణం! అది ఒట్టి వెదురు బొంగు అనుకుంటున్నారా ? కాదు. భరత జాతి దాస్య శృంఖలాలు తెంచడానికి ఆత్మ త్యాగం చేసిన వీరుల మేరునగ తుల్యమైన వెన్నెముక.! ఇది మామూలు జెండా కాదు , కానే కాదు! దీనికి పెట్టే దండం కేవలం ఆ జెండాకు కాదు! ఈ దేశానికి , దాస్య విముక్తికి ధారపోసిన అసువులకు , మహాత్ముల త్యాగానికి , మహామహుల ధైర్యానికి.... ఇది మనకు మనమే పెట్టుకునే దండం.! ఒక్క రోజైనా దండం పెట్టను అనే   వాళ్ళను ఏమనాలో  ఇప్పుడు చెప...

ఓమహిళానీకుఅక్షరాభివందనాలతో...

  పుడమితల్లినుండిభరతమాతవరకు అనసూయనుండిసుమతివరకు అరుంధతినుండిఆంగ్సాన్సూకీవరకు ఇందిరాగాంధీనుండిఇరొంచానుషర్మిళవరకు ఎమిలీడికిన్సన్నుండిహెలెన్కెల్లర్వరకు ఝాన్సిరాణీనుండిపూలన్దేవివరకు మేరీమాతనుండిమేడంక్యూరీవరకు సీతనుండిసావిత్రివరకు మండోదరినుండియశోధరవరకు కుంతినుండిద్రౌపదివరకు చంద్రమతినుండిదమయంతివరకు అహల్యనుండిశిఖండి ( అంబ ) వరకు నాటిశకుంతలనుండిమహానటిసావిత్రివరకు నాటిమేనకనుండినేటిజయలలితవరకు విజయలక్ష్మీపండిట్నుండి సరోజినీనాయుడువరకు దుర్గాబాయిదేశ్ముఖ్నుండికస్తూరిబాయివరకు రుద్రమదేవినుండిద్రౌపదిముర్మువరకు ఎంఎస్సుబ్బులక్ష్మినుండి మల్లాదిసుబ్బమ్మవరకు మొల్లనుండివెంగమాంబవరకు మదర్థెరిస్సానుండిమేధాపాట్కర్వరకు అనిబిసెంట్నుండిసుధామూర్తివరకు మీరాబాయినుండితారాబాయిషిండేవరకు ముద్దుపళనినుండిరంగాజమ్మవరకు బండారునాయకేనుండిఇంద్రానూయివరకు డొక్కాసీతమ్మనుండికిత్తూరుచెన్నమ్మవరకు యద్దనపూడినుండివాసిరెడ్డివరకు మాలతీచందూర్నుండిరంగనాయకమ్మవరకు నండూరిఎంకినుండివిశ్వనాథకిన్నెరసానివరకు కరణంమల్లీశ్వరినుండికల్పనాచావ్లావరకు తస్లీమానస్రీన్నుండిమలాలావరకు సింధూనుండి...

నేనొక నవకిసలయాన్ని...

  ఒక చిరునవ్వు, ఒక ఉదయాన్ని శాసిస్తుంది ఒక జీవితాన్ని నడిపిస్తుంది. ఒక ప్రాణాన్ని బ్రతికిస్తుంది. ఒక ఉదయాన్ని శ్వాసిస్తుంది ఒక ఉదయం, చిరునవ్వును స్వాగతిస్తుంది జీవితపుటాశలను బ్రతికిస్తుంది ప్రాణాల ఉనికిని నడిపిస్తుంది ఒక చిరునవ్వును శ్వాసిస్తుంది నాకెన్నో ఉదయాలున్నాయి అన్నే అస్తమయాలూను. ఒక చిరునవ్వు నవ్వడానికి జీవితాన్ని గాఢాలింగనం చేసుకోడానికి ప్రాణాన్ని బ్రతుకు నిండుగా శ్వాసించడానికి ఉదయపు పుష్యరాగాలను సాయంసంధ్యా పగడపు దీవులుగా మలచుకోడానికి... నాకింకా ఎన్నో వేకువ కువకువలట్లే ఉన్నాయి ప్రకటిత పాండుర సాంధ్యరాగాలుగా... ఎన్నో ఉషస్సులట్లే ఉన్నాయి నిజనీరవ నీలిమధురిమ నిశీధ గమకాలై.. ఎన్నో ప్రభాతాలట్లే ఉన్నాయి మేలి మనోహర గీతాలై. ఎన్నో వెన్నెలలట్లే ఉన్నాయి మరుజనిత విరహరావాల గానాలై.. ఒక రోజును కాలాంతమంతా జీవించడానికి ఒక జీవితకాలాన్ని ఒక్క రోజులోనే జీవించడానికి.. నేనిప్పుడు ప్రభవించిన కవిని నేనెప్పుడూ ప్రభవించే రవిని... నేను కాలం ప్రసవించిన గవినిని నా పయనం నానాటికీ నవీనం నా ప్రభవం నవీన పయనం.. నేనొక నవకిసలయాన్ని...   ...

నేను సామాన్యుడిని

  నేను సామాన్యుడిని నేను అతి సామాన్యుడిని నేను సామాన్యుడిని నేను అతి సామాన్యుడిని మధ్యతరగతి జీవన మందహాస గతికి అలవాటుపడిన మంద భాగ్యుడిని. ఆదాయంపై పన్ను కడతాను. కొన్న ప్రతిదానికీ మళ్లీ మళ్లీ పన్ను కడతాను. లైన్లో నిలబడి ఓటు వేస్తాను.. బ్యాంకులో నిలబడి డిపాజిట్ చేస్తాను... నేను సామాన్యుడిని నేను అతి సామాన్యుడిని ఏ ప్రభుత్వానికి అక్కరలేని వాడిని , ఏ సంస్థా నా వాడు అనుకోనివాడిని. నా ఓటు ఎందుకో గల్లంతు అవుతుంది. నా డిపాజిట్ పై వడ్డీ కూడా తగ్గుతుంది. ఓటు కోసం నేను పోరు చేస్తాను , వడ్డీ కోసం నేను ఓవర్ టైమ్ చేస్తాను. నేను సామాన్యుడిని నేను అతి సామాన్యుడిని నా ఊహల రెక్కలు ఇరుకు గదుల్లో ఇరుక్కు పోయాయి. నా ఆశల డెక్కల చప్పుడుకు ఆకాశం గొల్లుమంటుంది. వాయిదాలలో నేను అమెరికాను కొంటాను. వాయిదా కట్టడానికి ఎక్కడికైనా నడిచే వెళ్తాను... నేను సామాన్యుడిని నేను అతి సామాన్యుడిని నా సర్కిల్లో నేనే మేధావిని. అమెరికా అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో చెప్తాను ఈ దేశ ప్రధాని ఏం చేయాలో చెప్తాను. కానీ ,. మా ఆవిడ ఏం కూర వండాలో చెప్పలేను... నేను సామాన్యుడిని నేన...

శిలలా తిరిగిన ప్రకృతి

  రాత్రంతా చీకట్లో శిలలా తిరిగిన ప్రకృతి తెల్లారేసరికి చెక్కిన బొమ్మల్లే విచ్చుకుంది. రాత్రంతా చీకట్లో గొంగళిపురుగులా నడిచిన కాలం పొద్దున్నే నే చూసేసరికి సీతాకోకచిలుకై రెక్కలు అల్లార్చింది. రాత్రంతా చీకట్లో గుడ్లగూబలా మూల్గిన నిశ్శబ్దం వేకువ నే కళ్ళు తెరిచేసరికి సుప్రభాతమై గానం చేసింది. రాత్రంతా చీకట్లో మొద్దు నిద్దరపోయిన   మోహం మెలకువ వచ్చేసరికి అహంకారమై పరుగులు పెట్టింది. పరాశ్రీ ....211222

తనువులు రెండు తలపులూ రెండు

  తనువులు రెండు తలపులూ రెండు మమతలు వేరు మనసులూ వేరు ఏదో తెలియని బంధం ఎందుకో తెలియని   ఆనందం ఒకరిని ఒకరుగా మలిచిన స్వగతం ఇంకా ఇంకా మునిగిపోవాలనిపించే ఆఖాతం         ప్రేమను మించిన ప్రణయం ఏదో దేహాన్ని మించిన దాహం ఏదో ప్రళయాన్ని మించిన పరిమళం ఏదో వెలుగును మించిన ప్రకాశం ఏదో మనిషిని మించిన ఆ మమకారం ఏదో బంధాలను దాటిన బంధనం ఏదో కాలాన్ని మించిన కావ్యం ఏదో కలిపింది ఇద్దరినీ... నడిపింది ఒకే దారిని పువ్వులన్నీ పువ్వులూ కాదు ముళ్లన్నీ ముళ్లూ కాదు... కాలం మిగిల్చి పోయే కాలి గురుతులు... ఒకటిగా పుట్టకపోయినా .... ఒక్కటై కాలకపోయినా.... స్నేహ గంధాల పరిమళాలలో రక్త బంధాలను దాటిన ఎందరో స్నేహితులు...అందరికీ శుభాకాంక్షలు... ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు... పరాశ్రీ ....06082023