శ్రమైక జీవన సౌందర్యానికి

 

     శ్రమైక జీవన సౌందర్యానికి

     శాంతి అహింసల సామ్రాజ్యానికి

     వారసులం వారసులం

     స్వాతంత్య్రం సౌభ్రాతృమ్

     సమతామమతలు  మా స్వాస్థ్యం

 

అనంత జీవన మాధుర్యానికి

వినమ్ర జీవన సోపానానికి

వారసులం వారసులం

దానం ధర్మం త్యాగం స్నేహం మా స్వాస్థ్యమ్

 

విశాల దృక్పథ వినీల గగనాన

వెలిగే మువ్వన్నెల జెండా మనదే మనదే

విరోధి మనమున విశుద్ధ శాంతిని నింపే

అశేష భావనల విశేష సంస్కృతి మనదే మనదే

 

అమృత తరంగిణులు మా నదులు

అపార జ్ఞాన వాహినులు మా నుడులు

కాలం కాయం కష్టం కర్మం మా నిధులు

కదిలే కడలి కదలని నింగి మా బడులు

 

ఘర్మజలాలే మాకమృత సమానం

స్వేచ్ఛాచింతనలే మా సంకల్పం             

విశ్వశాంతి భావనలే మా సందేశం 

జగదేక కుటుంబం మా హృదయం..  

77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో


పరాశ్రీ ...12082023.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...