ఓమహిళానీకుఅక్షరాభివందనాలతో...

 

పుడమితల్లినుండిభరతమాతవరకు

అనసూయనుండిసుమతివరకు

అరుంధతినుండిఆంగ్సాన్సూకీవరకు

ఇందిరాగాంధీనుండిఇరొంచానుషర్మిళవరకు

ఎమిలీడికిన్సన్నుండిహెలెన్కెల్లర్వరకు

ఝాన్సిరాణీనుండిపూలన్దేవివరకు

మేరీమాతనుండిమేడంక్యూరీవరకు

సీతనుండిసావిత్రివరకు

మండోదరినుండియశోధరవరకు

కుంతినుండిద్రౌపదివరకు

చంద్రమతినుండిదమయంతివరకు

అహల్యనుండిశిఖండి (అంబ) వరకు

నాటిశకుంతలనుండిమహానటిసావిత్రివరకు

నాటిమేనకనుండినేటిజయలలితవరకు

విజయలక్ష్మీపండిట్నుండి

సరోజినీనాయుడువరకు

దుర్గాబాయిదేశ్ముఖ్నుండికస్తూరిబాయివరకు

రుద్రమదేవినుండిద్రౌపదిముర్మువరకు

ఎంఎస్సుబ్బులక్ష్మినుండి

మల్లాదిసుబ్బమ్మవరకు

మొల్లనుండివెంగమాంబవరకు

మదర్థెరిస్సానుండిమేధాపాట్కర్వరకు

అనిబిసెంట్నుండిసుధామూర్తివరకు

మీరాబాయినుండితారాబాయిషిండేవరకు

ముద్దుపళనినుండిరంగాజమ్మవరకు

బండారునాయకేనుండిఇంద్రానూయివరకు

డొక్కాసీతమ్మనుండికిత్తూరుచెన్నమ్మవరకు

యద్దనపూడినుండివాసిరెడ్డివరకు

మాలతీచందూర్నుండిరంగనాయకమ్మవరకు

నండూరిఎంకినుండివిశ్వనాథకిన్నెరసానివరకు

కరణంమల్లీశ్వరినుండికల్పనాచావ్లావరకు

తస్లీమానస్రీన్నుండిమలాలావరకు

సింధూనుండిహంపివరకు

మీర్జానుండినెహ్వాల్వరకు

ఆదిశక్తినుండిమనఅమ్మవరకు

అనాదినుండినేటివరకూ

ఎందరోయోధలు ... కరిగినీరైనజీవితాలు

అందరికళ్ళల్లోఅదేనిర్వేదం,అదేపోరాటం

అందరినవ్వుల్లోఅదేఅవేశం, అదేవిజయగర్వం

ఆకళ్ళల్లోఎన్నోలోతులు

ఆలోతుల్లోఎన్నోలోయలు

ఆలోయల్లోఎన్నోహొయలు

ఆహొయల్లోఎన్నోహోరులు

ఆహోరుల్లోఎన్నోదారులు

ఆదారుల్లోఎన్నోగమ్యాలు

ఆగమ్యాల్లోఎన్నోగాయాలు

ఆగాయాల్లోఎన్నోజ్ఞాపకాలు

అక్షరాలకుఅందనిభావాలు

భావనకుఅందనిభయాలు

అనుభూతికిచిక్కనిఅనుభవాలు.

ఆనవ్వుల్లోఎన్నోఅర్థాలు

ఆఅర్థాల్లోఎన్నోకథలు

ఆకథల్లోఎన్నోకావ్యాలు

ఆకావ్యాల్లోఎన్నోగేయాలు

ఆగేయాల్లోఎన్నోగతాలు

ఆగతాల్లోఎన్నోస్వప్నాలు

ఆస్వప్నాల్లోఎన్నోవిప్లవాలు

ఆవిప్లవాల్లోఎన్నోఓటములు

   ................కొన్నేగెలుపులు

అక్షరాలకుఅందనిభావాలు

భావనలకుఅందనిధైర్యాలు

ఆశలుగామిగిలిపోయినఅశయాలు

ఊహల్లోబ్రతికినక్షణాలు

ఊపిరిసలపనిఊసులఉప్పెనలు

బానిసగాచూసేఆచారపుసంకెలలు

ప్రాణంతోపోరాడేసృష్టిప్రయాణాలు

ఉనికికోసంతిరగబడేపోరాటాలు

ఎదురుచూపులు, నిరాశలు,

ఎన్నోనిశీధాలు

కొన్నేకోరుకున్నవేకువలు.

కొరుక్కుతినేకళ్ళు,

పొడుచుకుతినేమాటలు

కళ్ళల్లోనేకుక్కుకున్నకన్నీళ్లు.

కన్నీళ్లుచెక్కిబరువెక్కినగుండెరాళ్ళు

అక్షరాలుచెక్కలేనిఆత్మకథలు

కన్నీళ్ళతోచెక్కినశిల్పాలు

ఆడవాళ్ళహృదయకుహరకుడ్యాలు

అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా,

కూతురిగా, కోడలిగా, సహచరిగా

ఆఫీసులో, బస్సులో, ఇంటిపక్క, సంతలో,

స్త్రీగా, శక్తిగా, ప్రకృతిగా,

అనాదినుండిఅందర్నీకన్నతల్లి

ఆదినుండిలోకాన్నేకన్నతల్లి

సృష్టిజీవజీవనవాహినీస్రవంతికి

తనరుధిరాన్నిధారపోసిన

అమృతమయి

అనురాగమయి

అందరికీఆడపిల్లేఅయిన

ఓమహిళానీకుఅక్షరాభివందనాలతో...

మహిళాదినోత్సవశుభాకాంక్షలు...

ఇంతప్రపంచాన్నికనిపెంచిపోషించిపాలిస్తున్నప్రతిమహిళకూఈకవితఅంకితం..

పరాశ్రీ....14022023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...