శిలలా తిరిగిన ప్రకృతి

 

రాత్రంతా చీకట్లో

శిలలా తిరిగిన ప్రకృతి

తెల్లారేసరికి చెక్కిన బొమ్మల్లే విచ్చుకుంది.

రాత్రంతా చీకట్లో

గొంగళిపురుగులా నడిచిన కాలం

పొద్దున్నే నే చూసేసరికి సీతాకోకచిలుకై

రెక్కలు అల్లార్చింది.

రాత్రంతా చీకట్లో

గుడ్లగూబలా మూల్గిన నిశ్శబ్దం

వేకువ నే కళ్ళు తెరిచేసరికి

సుప్రభాతమై గానం చేసింది.

రాత్రంతా చీకట్లో

మొద్దు నిద్దరపోయిన  మోహం

మెలకువ వచ్చేసరికి అహంకారమై

పరుగులు పెట్టింది.


పరాశ్రీ ....211222

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...