నేను సామాన్యుడిని
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
మధ్యతరగతి జీవన మందహాస గతికి
అలవాటుపడిన మంద భాగ్యుడిని.
ఆదాయంపై పన్ను కడతాను.
కొన్న ప్రతిదానికీ మళ్లీ మళ్లీ పన్ను
కడతాను.
లైన్లో నిలబడి ఓటు వేస్తాను..
బ్యాంకులో నిలబడి డిపాజిట్ చేస్తాను...
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
ఏ ప్రభుత్వానికి అక్కరలేని వాడిని,
ఏ సంస్థా నా వాడు అనుకోనివాడిని.
నా ఓటు ఎందుకో గల్లంతు అవుతుంది.
నా డిపాజిట్ పై వడ్డీ కూడా తగ్గుతుంది.
ఓటు కోసం నేను పోరు చేస్తాను,
వడ్డీ కోసం నేను ఓవర్ టైమ్ చేస్తాను.
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
నా ఊహల రెక్కలు ఇరుకు గదుల్లో ఇరుక్కు
పోయాయి.
నా ఆశల డెక్కల చప్పుడుకు ఆకాశం గొల్లుమంటుంది.
వాయిదాలలో నేను అమెరికాను కొంటాను.
వాయిదా కట్టడానికి ఎక్కడికైనా నడిచే
వెళ్తాను...
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
నా సర్కిల్లో నేనే మేధావిని.
అమెరికా అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో
చెప్తాను
ఈ దేశ ప్రధాని ఏం చేయాలో చెప్తాను.
కానీ,. మా ఆవిడ ఏం కూర వండాలో చెప్పలేను...
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
నాదొక పొదరిల్లు
నా వ్యధ ఎవరికీ అక్కరలేని ది
నేను డెబ్బై శాతం జనాభా కు ప్రతినిధిని
నేనెవరిని అక్కరలేని గుణనిధి ని
నాదొక చిన్న జీవితం
పెరిగే ప్రతి రూపాయి భారం నాపై పెద్ద
ఆశనిపాతం.
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
సంపన్నులకు ఇచ్చే సదుపాయాలు,
బీదలకు ఇచ్చే వరాలు నాకు కావు
లాభాలు....
నేను మాత్రం రైతుబజార్ లో
నేను మాత్రం రైల్వే స్టేషన్లో..
నేను మాత్రం జెనరల్ స్టోర్స్ లో...
నేను మాత్రం వీధి బండి హోటల్లో...
నేను మాత్రం సర్కారు దవాఖానలో...
నేను మాత్రం గొప్పోళ్ల కారు డోరు
దగ్గరలో...
ఎక్కడ చూసినా నేనే ఆశాభావంతో....
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని
వానొచ్చినా , ఎండొచ్చినా, వరదొచ్చి
నా... ఏది ఎదురొచ్చి నా... నేనే.
ద్విచక్ర వాహనం పై నేనే...
నాలుగు ప్రాణాలతో నేనే...
నలుగురు మనుషులతో నేనే....
ఎక్కడ చూసినా నేనే....
నా పేరు కామన్ మాన్...
నేను సామాన్యుడిని
నేను అతి సామాన్యుడిని........
పరాశ్రీ....08062020
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి