తనువులు రెండు తలపులూ రెండు

 

తనువులు రెండు

తలపులూ రెండు

మమతలు వేరు

మనసులూ వేరు

ఏదో తెలియని బంధం

ఎందుకో తెలియని  ఆనందం

ఒకరిని ఒకరుగా మలిచిన స్వగతం

ఇంకా ఇంకా మునిగిపోవాలనిపించే ఆఖాతం

        ప్రేమను మించిన ప్రణయం ఏదో

దేహాన్ని మించిన దాహం ఏదో

ప్రళయాన్ని మించిన పరిమళం ఏదో

వెలుగును మించిన ప్రకాశం ఏదో

మనిషిని మించిన ఆ మమకారం ఏదో

బంధాలను దాటిన బంధనం ఏదో

కాలాన్ని మించిన కావ్యం ఏదో

కలిపింది ఇద్దరినీ... నడిపింది ఒకే దారిని

పువ్వులన్నీ పువ్వులూ కాదు

ముళ్లన్నీ ముళ్లూ కాదు...

కాలం మిగిల్చి పోయే కాలి గురుతులు...

ఒకటిగా పుట్టకపోయినా ....

ఒక్కటై కాలకపోయినా....

స్నేహ గంధాల పరిమళాలలో రక్త బంధాలను దాటిన

ఎందరో స్నేహితులు...అందరికీ శుభాకాంక్షలు...

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు... పరాశ్రీ ....06082023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...