నిశ్శబ్ద భావ తరంగాలు
నిశ్శబ్ద భావ తరంగాలు
నాలో నిత్యం కదిలే
కల్లోల కడలి అలజడులు....
నిశీధి ధూమ తరంగాలు
నాలో నిత్యం రగిలే
జ్వాలా శైల అగ్నిశిఖలు.....
నిర్ణిద్ర ఆశా అంతరంగాలు
నాలో నిత్యం పెరిగే
మహా శిఖర హిమపాతాలు.....
నేను నిరతం జ్వలించే అగ్ని శిఖరాన్ని
నేను నిరతం జృoభించే హిమపాతాన్ని...
నేను నిరతం శ్వాశించే ప్రాణ వలయాన్ని...
నేను ఒకచో గాలిలో కలిసే వాయులీనాన్ని...
నేను ఒకచో మట్టిలో కలిసే మంచి ముత్యాన్ని....
నేను ఒకచో మంటలో కలిసే ముగ్ధ శిశిరాన్ని...
నేను ప్రకృతి ఒడిలో మురిసే మృదు శైశవాన్ని....
నేను ప్రకృతి ప్రతిబింబాన్ని.....నేను ఒక సుకృతిని..
పరా శ్రీ.....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి