ఈ లోకంలో నేనో చిన్ని ప్రపంచాన్ని సృష్టించుకున్నాను,
ఈ
లోకంలో నేనో చిన్ని ప్రపంచాన్ని సృష్టించుకున్నాను,
నా
కుటీరంలో నేనో విశాల విశ్వాన్ని నిర్మించుకున్నాను.
సముద్రానికి
జ్ఞాన తృష్ణ ఎక్కువ, తనకు తెలిసినవన్నీ తలచుకుని తలమునకలవుతుంది.
తెలియనివాటికై
అలలా ఎగసి ఎగసి అల్లకల్లోలమవుతుంది.
అన్నీ
తనకే తెలియాలనే దూరాశతో ఎంతో ఎత్తుకు ఎగసి అన్నీ తనలో కలిపేసుకుని
అన్నీ
తానై లోకాన్ని ముంచేస్తుంది.
అంతా
తానై కనిపిస్తుంది అలలా, తను అలా అందుకోలేని వాటికై ఎంత ఎగసినా ఆకాశం అందనిదే.
ఆ
ఆశ తీరనిదే, జీవితం ఈ చివర తీరాన మొదలుపెట్టి ఆ దరికి చేరేవరకు జీవితమే,
ముందు
తెలియక పోవడమే జీవితం , అన్నీ ముందే తెలిస్తే అది నాటకము.
అనుకున్నవన్నీ
జరిగితే జీవితంలో చెప్పుకోతగ్గవేమీ మిగిలి ఉండవు
అనుకోనివి
కొన్ని జరిగితేనే అసలు సిసలైన జీవన క్షణాలు వెలుగుచూస్తాయి.
ఊహించడానికి
భయపడినా , నిజంగా జరిగినపుడు నచ్చకపోయినా ఒప్పుకోక తప్పదు.
మరచిపోవడం
గాయానికి కాలం వేసే మందు. నెమరువేసుకోవడం
బుద్ధి తెచ్చిన బహుమతి.
బద్ధులవడం
బ్రతుకు నేర్పిన నడవడి.
నడచిపో
, నడచిపో, నడచిపో నవ నాగరికతా లోకానికి, బదులివ్వని ప్రశ్నల పరంపరతో ,
తెలుసుకో
, తెలుసుకో, తెలుసుకో నవ నూతన సత్యాన్ని .. తిరిగి ఎదురవ్వని ప్రశ్నల పరంపరతో
సత్యాన్వేషణలో
ప్రశ్నలన్నీటికి సమాధానం ఒకటే,
తరచి
తరచి ఆలోచిస్తే ప్రశ్నల మూలం ఒకటీ.
సత్యం
సత్యమై సత్యంలా నిరంతరం అలా ప్రవహిస్తూనే ఉంటుంది.
కాలగమనంలో
మరో ప్రపంచానికి వెలుగుదివ్వెలా వెలుతురు కిరణమై ప్రసరిస్తుంది.
నీవే
లేనపుడు నీ జేవితానికి విలువేది.
అసలు
నీవే లేనపుడు నీకిక జీవిత్తమెక్కడిది.
జీవితంలో
నీకు ప్రాధాన్యాలు ఉంటాయి, కానీ జీవితం ప్రాధాన్యాల జాబితాలో ఉండదు, ఉండకూడదు.
ప్రసరించే
కాంతి కిరణం లోకానికి వెలుగుణనిస్తుంది, తన ఉనికికి హేతువుని చూపిస్తుంది
అసలు
కాంతి జనకమే లేనప్పుడు కిరణానికి తావేది.
ఇక
మిగిలేదంతా శూన్యమే.
శూన్యము
ఎటునుంచైనా ఒకటే , ఎలా చూసినా ఒకటే
అంతా
శూన్యమే కాబట్టి....
పరాశ్రీ
.. 06122011
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి