బాగు బాగు లోకం భలే గొప్పది...???
నాలుగు దారులు కలిసే చోటు,
అక్కడో చెట్టు.
క్రిందనో రాయి, దేవుడని
పేరు.
నలుగురు మనుషులు నడిచే దారి,
ప్రక్కనో పుట్ట.
లోపలో పాము, దేముడని
పేరు.
నాలుగు కాలాలు కలిసిన తావు
వంతలో వగ్గుతల
ముడతలతోలు పిచ్చిదని పేరు...!!!!
బాగు బాగు లోకం భలే గొప్పది...???
పరాశ్రీ ....29032023.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి